12 ఏళ్లకొకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 11 నుండి 16 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు రద్దు చేశారు. అయితే ఇదే అదనుగా తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వంపై పుకార్లు వ్యాపింపచేస్తున్నారు వైకాపా మరియు జనసేన అభిమానులు.
ఆగమ శాస్త్రాల ప్రకారం తీసుకున్న నిర్ణయమైనా ఒక పథకం ప్రకారం గుడిలోని ఆభరణాలను, విలువైన సంపదను మాయం చెయ్యడానికి గుడిని మూసి వేస్తున్నారని పుకార్లు వ్యాపింపచేస్తున్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీం కోర్టులో కేసు వేస్తున నేపథ్యంలో ఇప్పటికే మాయం చేసిన సంపదకు సంబంధించిన ఆధారాలను మాయం చేస్తున్నారని కూడా పుకార్లు సృష్టిస్తున్నారు.
నిజానికి మహాసంప్రోక్షణ అనే కార్యక్రమం 1958లో శ్రీకారం చుట్టారు. చివరిసారిగా 2006లో నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడు నిర్వహించనున్నారు. నిజానికి ఆలయంలో మరమ్మతు పనులను నిర్వహించేందుకు నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో 12ఏళ్లకొకసారి దీనిని నిర్వహిస్తారు. అక్కడ చేయాల్సిన మరమ్మతులను బట్టి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఆగమ పండితులు నిర్ణయిస్తారు.