Subrahmanyapuram First Lookసుమంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం “సుబ్రహ్మణ్యపురం” సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ముందు నిల్చుని ఉన్న సుమంత్ ను బ్యాక్ యాంగిల్ లో చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగానే ఉంది. దైవత్వంతో కూడిన కధలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారన్న విషయం నిఖిల్ “కార్తీకేయ” సినిమా స్పష్టం చేసింది. అయితే ఈ ఫస్ట్ లుక్ కూడా ‘కార్తీకేయ’ సినిమా ఫస్ట్ లుక్ నే జ్ఞప్తికి తేవడం కాస్త మైనస్.

చాలా కాలంగా ఓ హిట్ కోసం వేచిచూస్తున్న సుమంత్, ఈ సారి జోనర్ మార్చి ఫాంటసీతో కూడిన మిస్టరీ సబ్జెక్టుతో రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా సుమంత్ స్పష్టం చేసారు. ఇప్పటికీ సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యిందని చెప్తోన్న ఈ సినిమా సుమంత్ కెరీర్ లో 25వ సినిమా కావడంతో ఈ “సుబ్రహ్మణ్యపురం”కు మరో ప్రాధాన్యత లభించినట్లయ్యింది.