Chandrababu-naidu-Governor-NArasimhanగవర్నర్ నరసింహన్ ఉన్నఫళంగా విజయవాడ ట్రైన్ లో వచ్చి మరి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారని సమాచారం. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్‌ సూచించినట్లు కొన్ని మీడియా ఛానెళ్ళలో వచ్చింది. అయితే కేంద్రం చంద్రబాబుని బెదిరించాలని చూస్తుందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. అయితే అసలు కారణం మాత్రం వేరే ఉందట.

దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై మొదటి మీటింగ్ ఇటీవలే కేరళలో జరిగిన సంగతి తెలిసిందే. రెండో మీటింగ్ అమరావతిలో జరగబోతుంది. మే 7న అమరావతిలో దక్షినాది రాష్ట్రాలే కాదు, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలు కూడా వస్తున్నాయి. ఈ మీటింగు ఎలా అయినా జరగకూడదని మోడీ ప్రభుత్వం అభిలాష.

మోడీ రాష్ట్రాల పై చూపిస్తున్న వివక్షకు ఒక వేదిక ఏర్పాటవుతుంది దీని వల్ల ఆ పార్టీ అవకాశాలు కర్ణాటకలో దెబ్బతినే అవకాశం ఉంది గనుక ఇటువంటి ప్రయత్నాలు దేశ సమగ్రతకు చేటు అని గవర్నర్ తో రాయబారం చేశారట. అంతకు ముందు కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ జైన్ ను కూడా అమరావతి పంపారు. అయితే ఈ సమావేశం యధాతధంగా జరగబోతున్నట్టు సమాచారం.