అశేష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్న ‘జనసేన’ కాకినాడ సభలో విషాదం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. కాకినాడకు సమీపంలో గల కాజులూరు మండలం, కుయ్యూరుకు చెందిన 19 సంవత్సరాల వెంకట రమణ అనే యువకుడు మృతి చెందినట్లుగా ప్రాధమిక సమాచారం. ఈ తొక్కిసలాటలో పలువురు గాయాల పాలయ్యారు.
పవన్ సభకు చేరుకునే సమయానికే కిక్కిరిసిన జనాభిమానం, పవన్ రాగానే ఒక్కసారిగా ముందుకు దూకారు. దీంతో ఒకరిపై ఒకరు పడగా, ఊపిరి అందక వెంకట రమణ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే గాయపడిన మిగిలిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి పవన్ తెలుసుకుంటే… మృతుని కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉందంటూ అభిమాన వర్గం చెప్తోంది.