SS Thaman to compose Music for Allu Arjun- Trivikram Srinivas Movieఅల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రెండు అల్బుములు పెద్ద హిట్ అయ్యాయి. అయితే దేవి ఈ మధ్య ఫార్మ్ లో లేకపోవడంతో తమన్ ను తీసుకుంది చిత్రబృందం. దీనితో తమన్ పై ఎక్కువ బాధ్యత ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగులు ఈరోజు ప్రారంభం అయ్యాయి.

తమన్ తో పాటు త్రివిక్రమ్, బన్నీ కూడా పాల్గొంటున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో సినిమాలో కథానాయిక నటించింది. ఇంకోవైపు బన్ని హీరోగా నటించిన ‘డీజే’ అదేనండి ‘దువ్వాడ జగన్నాథం’లో కథానాాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌తో నటించిన ఈ సినిమాతోనే కథానాయికగా పూజా హెగ్డే దశ తిరిగింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్‌గా వరుస అవకాశాలను తీసుకొచ్చింది.

అలాగే ఈ సినిమా కోసం పూజా హెగ్డే తన గొంతు సవరించుకుంటుందని సమాచారం. అంతేకాదు తమన్ ఈ సినిమాలో పూజా హెగ్డేతో ఒక ఫోక్ సాంగ్ పాడించబోతున్నట్టు చెబుతున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్స్ అపుడపుడు గాయనిగా తమ గొంతు సవరించుకున్నారు. మరి త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో పూజా పాట ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందని, దానికోసం కాజల్ ను తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.