రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సినిమా పింక్ తో తిరిగి సినిమాలలోకి రానున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న జరిగాయట. అయితే దాని గురించి నిర్మాతలు ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. మరో వైపు థమన్ సారథ్యంలో పింక్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని దిల్ రాజు నిన్న రాత్రి ప్రకటించారు.
అయితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని చెప్పకపోవడం విశేషం. అయితే థమన్ మాత్రం హీరో గారితో నా మొదటి బిగ్ జర్నీ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో థమన్ పని చెయ్యడం ఇదే మొదటి సారి. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు అనే విషయం అంత సీక్రెట్ ఉంచాల్సిన అవసరం ఏంటో అర్ధం కాదు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది.
అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. జనవరి నుండి షూటింగ్ మొదలు అవుతుందని, ఫిబ్రవరిలో పవన్ ఎంటర్ అవుతారని సమాచారం. నాన్ – స్టాప్ సింగల్ షెడ్యూల్ లో మొత్తం ఆయన పార్టు పూర్తి చేస్తారట.
Managing Two Heroines, This Manager Becomes A Sucker!
పెద్దాయన్ని అంటారేంటి…. బుర్ర ఉందా?