ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ తరుణంలో చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకూ చిత్ర షూటింగ్ దాదాపుగా 70% వరకూ పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా రేపు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి, సినిమాలోని ప్రతినాయకుల గురించి ప్రకటిస్తామని చిత్రబృందం అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.
70% షూటింగ్ పూర్తి అయ్యిందంటే సినిమా విడుదల మీద వస్తున్న పుకార్ల పై కూడా చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. మిగతా 30%, సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ కు ఎనిమిది నెలల సమయం ఉంది. జులై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రఘుపతి రాఘవ రాజారాం, రామ రౌద్ర రుషితం అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ABN RK: Will MNCs Sign MOUs With CM On Bail?
NTR Arts: Terrified NTR Fans Can Relax!