SS Rajamouli On Prabhas - Baahubaliఒక సినిమా కోసం అయిదేళ్ళు కష్టపడ్డాడని, మధ్యలో విరామం వచ్చినపుడు మరొక సినిమా చేసుకోమని చెప్పినా, చేయకుండా అలాగే ‘బాహుబలి’ పైన దృష్టి పెట్టి కష్టపద్దాడని ప్రభాస్ ను పొగిడిన ‘దర్శకధీరుడు’ రాజమౌళి, తన ‘డార్లింగ్’ ఎంత బద్ధకస్తుడో కూడా చెప్పుకొచ్చాడు. అవును… స్వయంగా రాజమౌళినే ఈ వ్యాఖ్యలు చేసారు. ‘బాహుబలి 2’ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్న తరుణంలో… తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ బద్ధకతనం గురించి చెప్పారు.

“ఒక సినిమా కోసం ప్రభాస్ ఎంతగా కష్టపడతాడో, వ్యక్తిగత జీవితంలో ప్రభాస్ అంత బద్ధకస్తుడని, దానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు” జక్కన్న. ముంబైలో ట్రైలర్ లాంచ్ చేయడానికి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ప్రభాస్ వెయిట్ చేస్తున్నాడని, నిజానికి అప్పటివరకు అక్కడ వెయిటింగ్ కు ఓ లాంజ్ ఉందని కూడా తమకు తెలియదని, ఇంకా అరగంట సమయం ఉండగా, తాను వెళ్లి బయలుదేరదామని అన్నానని, దానికి ప్రభాస్… కష్టపడాలంటే రాజమౌళి వెంట వెళ్ళాలని, సులువుగా వెళ్ళాలంటే నేను చెప్పింది చేయాలని అన్నాడని నవ్వుతూ చెప్పాడు.

ఇక, 10 నిముషాల సమయం ఉన్నప్పుడు కూడా ‘నన్ను నమ్మండి’ అక్కడ లైన్ లో 15 మంది ఉన్నారు, అయిదుగురు వచ్చాకా నాకు చెప్పండి అంటూ ప్రభాస్ చెప్పిన విధానాన్ని ఇమిటేట్ చేస్తూ రాజమౌళి చెప్పిన విధానం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ సమయంలో ఇక తాను ఉండలేనని, నువ్వు ఎప్పుడు వస్తావో రా… అంటూ నేను వెళ్ళిపోయానని, ఆ తర్వాత వచ్చిన ప్రభాస్, నేను చెప్పానా… సులువుగా రావాలంటే నా వెంట రావాలని అని చెప్పడంతో తామంతా నవ్వేసామని ‘డార్లింగ్’ వ్యవహార తీరును రాజమౌళి చెప్పుకొచ్చారు.