ఆస్కార్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ అవార్డుకి లైఫ్ లో తమ సినిమా ఒక్కసారైనా నామినేట్ అవ్వాలని ఎంత గొప్ప డైరెక్టర్స్ అయినా ఆశపడతారు. ప్రపంచంలో ఏదయినా ఒక అవార్డు డబ్బుతో కొనుక్కోలేనిది ఉంది అంటే అది కచ్చితంగా ఆస్కార్, అందుకే ఈ అవార్డు అంత స్పెషల్.
రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఆస్కార్ క్యాంపైన్ జరుగుతుండం తెలిసిందే. కానీ రాజమోళి అంటే గిట్టని బ్యాచ్ ఏకంగా ఆస్కార్ అవార్డు కొనుక్కోవడానికి (అదే లాబీయింగ్) ఆర్ ఆర్ ఆర్ బృందం ప్రయత్నాలు చేస్తుందని ప్రోపగాండా మొదలెట్టారు. ఆస్కార్ కొనలేరు అనేది వాళ్ళకి తెలియక కాదు, తెలుగు మూవీ ఫాన్స్ కి అంత ఐడియా ఉండదు కాబట్టి నమ్మేస్తారు లే అనే నమ్మకం. కానీ ఇది సోషల్ మీడియా ఎరా, యూత్ అంత అమాయకులు కాదుగా మాస్టారూ.
Also Read – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ… నేడే ప్రకటన?
1957 లో మహబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’ సినిమా ఆస్కార్ అవార్డు కి నామినేషన్ పొందినపుడు, చాలా ఖర్చవుతుందని భయపడ్డారట మహబూబ్ ఖాన్. స్వతంత్రం వచ్చి పదేళ్లే అవ్వడం వలన భారత ఆర్ధిక స్థితి అంత మెరుగ్గా లేనందువలన, భారత ప్రభుత్వం కూడా మదర్ ఇండియా సినిమా దర్శక నిర్మాతలకి సాయం చెయ్యలేకపోయింది.
ఇక ఆమిర్ ఖాన్ ‘లగాన్’ సినిమా ఆస్కార్ కి ఎంపికవడం, దానికోసం ఆమిర్ ఖాన్ ఆస్కార్ మెంబర్లకు సినిమా చూపించడానికి థియేటర్లు బుక్ చేసి, పబ్లిసిటీ చేసి, ప్రెస్ మీట్లు పెట్టి , ఈవెంట్లు ప్లాన్ చేసి మొత్తం అప్పట్లోనే యాభై వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. లగాన్ సినిమాని ఆస్కార్ జ్యూరీ సభ్యులకు చూపించడం కోసం చాలా ఖర్చు పెట్టానని ఆమిర్ స్వయంగా తెలపడం తెలిసిందే.
Also Read – టాలీవుడ్‌కి ఓ హేమ కమిటీ అత్యవసరమే
ఇప్పుడు మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ఆస్కార్ సభ్యుల కంట్లో పడాలంటే రాజమౌళి బృందం హాలీవుడ్ వెళ్ళాలి, అక్కడ ఆస్కార్ సభ్యులకు సినిమా చూపించాలి. దీనికి కచ్చితంగా ఖర్చవుతుంది. అది చిత్రబృందమే భరించాలి. సినిమా ఆస్కార్ సభ్యులకు నచ్చితే , పోటీ పడుతున్న సినిమాలు ఆర్ ఆర్ ఆర్ కంటే గొప్పగా లేకుంటే, రాజమౌళి ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని రికమండేషన్, లాబీయింగ్ తో ఆస్కార్ అవార్డు తెచ్చుకోవచ్చు అనడం సిల్లీ.
డబ్బులిచ్చి కొనుక్కోగలిగితే ..అవార్డులు కొనేసుకోగల సత్తావున్నవాడు జేమ్స్ కామెరాన్, అయన తీసిన అవతార్ సినిమాకే అన్ని అవార్డులు వచ్చేయాలిగా రాలేదేం? అవతార్ సినిమా మూడు అవార్డుల తో సరిపెట్టుకుంది.ఇదీ ఈ అవార్డు కున్న విలువ.
Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!
రాజమౌళి ఏకంగా అరవై కోట్లు ఖర్చుపెట్టేస్తున్నాడు దాంతో మరో భారీ బడ్జెట్ సినిమా తీయొచ్చు అని సలహా కూడా ఇస్తున్నారు. ఇదెంత సిల్లీ గా ఉన్నా, ఒక నిమషం నిజం అనుకుందాం. నీకు పోయేదేంటి? ఎందుకీ ఏడుపు? తెలుగు సినిమా బాలీవుడ్ ని ఊపేసింది అని గర్వంగా ఫీల్ అయినట్టు, మనం హాలీవుడ్ లో కూడా జెండా ఎగరేస్తే పెరిగేది మన తెలుగు సినిమా స్థాయే గా.. మోగేది తెలుగోడి పేరే గా.. ఓ “మనోడు” కాదనా ఈ ఏడుపు .. అయితే కంటిన్యూ .. కంటిన్యూ.. అప్పుడే ఏమయిందిలే రేపు నిజంగానే నామినేట్ అయితే అప్పుడుతుంటది అసలు టార్చర్!