ss rajamouli favourite actor senior ntr‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు ‘రాజమౌళి.’ దర్శకుడిగా ఎన్నో రెట్లు ఖ్యాతి సంపాదించుకున్న దర్శకధీరుడు ఇటీవల ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో విద్యార్ధులతో మమేకమయ్యారు. ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కృషి నుండి అన్నీ తెలిపిన రాజమౌళి… మొదటిసారిగా తన అభిమాన హీరో ఎవరో మొదటి సారిగా ఈ ప్రపంచానికి తెలియచెప్పారు.

“చిన్నతనంలో సీనియర్ ఎన్టీఆర్ కు నేను చాలా పెద్ద అభిమానినని, ఆయన నటించిన సినిమాలే ఎక్కువగా చూసేవాడిని, ముఖ్యంగా ‘అగ్గిబరాటా, సగ్గిపిడుగు’ వంటి చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని” రాజమౌళి చెప్పారు. చిన్నతనం నుండి నేను చాలా సినిమాలు చూస్తూ ఉండేవాడినని, అప్పట్లో రాజమండ్రిలోకి వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను కూడా ఎక్కువగా చూసేవాడినని తన గత స్మృతులను విద్యార్ధులతో పంచుకున్నారు.

బాల్యంలో సీనియర్ ఎన్టీఆర్ తో పాటు బ్రూస్ లీ అంటే కూడా చాలా ఇష్టమని, ఆయన సినిమాలు కూడా చూస్తుంటానని, ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నానని ఈ సందర్భంగా దర్శకదిగ్గజం చెప్పారు. మొదటిసారిగా రాజమౌళి చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సందడి చేస్తున్నాయి.