vijayendra-prasad Interview about RRR“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా కధ రచయిత., రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కధ అనుకోని హీరోలను ఎంచుకున్నారా? లేదా హీరోలను ఎంచుకొని కధ రాశారా? అని హీరోల గురించి., కథ గురించి అడిగారు.

తనకు మొదటి ప్రాధాన్యత ‘కథే’ అని ఆ తరువాతే వారి వారి పాత్రలకు తగ్గ కధానాయకుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇద్దరి హీరోల పాత్రలను గురించి మాట్లాడుతూ ఇందులో మీరు రామ్ చరణ్ కు ఎక్కువ మార్కులు వేస్తారా? లేక ఎన్టీఆర్ కు ఎక్కవ మార్కులు ఇస్తారా? అంటూ విజయేంద్ర ప్రసాద్ ను ఇరుకున పెట్టే ఒక క్లిష్టమైన ప్రశ్న వేశారు యాంకర్.

ఇందుకు ఏ మాత్రం తడపడకుండా నాకు వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అంటే ఇష్టం.., కానీ సినిమా వరకు రామ్ చరణ్ కే రెండు మార్కులు ఎక్కువ వేస్తాను అంటూ అందుకు కారణం కూడా చెప్తా అంటూ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ అంటూ అడవి బిడ్డ పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర తెరపై చాలా స్వచ్ఛంగా కనపడుతుంది., ఈ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.

రామ్ చరణ్ పోషించిన ‘అల్లూరి పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి., అటువంటి పాత్రను పోషించడం కష్టతరం. రామ్ ఆ పాత్రను పోషించిన తీరుకి., పలికించిన ఎక్స్ ప్రెషన్ కి రెండు మార్కులు ఎక్కువ వేస్తున్నా అంటూ బదులిచ్చారు. రోజురోజుకి అంచనాలను పెంచుతున్న వీరి సంభాషణలతో ఇద్దరి అభిమానులలో సినిమాపై ఉత్సుకత పెరిగిపోతుంది.