SRk On Mahendra Singh Dhoni IPl Auctionక్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా! పూణే జట్టు ఓనర్ ధోనిని ఉద్దేశించి ఒక్క మాట అన్నారని, అభిమానులు, నెటిజన్లు సదరు పూణే జట్టు యాజమానిని ఊతికి ఆరేసినంత పని చేసారు. దీంతో ఆయన గారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తన తప్పును ఒప్పుకోక తప్పలేదు. అలాంటి ధోని ప్రస్తుతం పూణే జట్టు తరపున ఆడుతున్నా, వచ్చే ఏడాది మాత్రం పూణే జట్టుకు అందుబాటులో ఉండడన్న విషయం ఖరారైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీ ఎంట్రీ ఇవ్వనున్న నేపధ్యంలో…

మళ్ళీ చెన్నైకు సారధ్యం వహించే అవకాశం ధోనిని వరిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే చెన్నై ఏమో గానీ, ధోని పేరు ఆక్షన్ కు వస్తే మాత్రం, తాను విడిచిపెట్టబోనని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓనర్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. ధోని ఆక్షన్ కు వస్తే, ఎంత పెట్టైనా కొనుగోలు చేస్తానని, ఆఖరికి నా కాస్ట్యూమ్స్ అమ్మైనా ధోనిని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లుగా షారుక్ స్పష్టం చేసారు. అయితే ఒక్క కోల్ కతా, చెన్నై మాత్రమే కాదు బరిలో ఉన్న ప్రతి జట్టు ధోని కోసం విశ్వప్రయత్నాలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.