Baahubali Writer Vijayendra Prasad for Sequel Nayakవిజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ వల్లీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను విజయేంద్రప్రసాద్ అనవసరంగా తెరకెక్కించారని సినీ విమర్శకులు తేల్చేశారు. ఈ పరభవాన్ని గురించి విజయేంద్ర ప్రసాద్ తాజాగా మాట్లాడారు.

ఈ సినిమా కథ ఆసక్తికరమైనదేననీ .. ఆకట్టుకునేదేనని, తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అయితే తాను సరిగ్గా తెరకెక్కించలేకపోవడం వల్లనే ఈ సినిమా పరాజయాన్ని చవిచూసిందని అన్నారు. మరింత బాగా తాను చిత్రీకరించవలసి ఉండవలసిందని చెప్పారు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి తానే కారణమని అంగీకరించారు.