Srinivasa Reddy Reddeppagari counter to jagan governemntమొన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ లతో సమావేశమైనప్పుడు, కొంతమంది మంత్రులతో సహా 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని స్వయంగా చెప్పుకొంటూనే మళ్ళీ వచ్చే ఎన్నికలలో 175 సీట్లు తప్పక గెలుస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సమావేశంలో కొందరు మంత్రులు తాము వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేమని, తమ కుమారులను బరిలో దించుతామని చెప్పగా, సిఎం కేసీఆర్‌ వారి ప్రతిపాదనను తిరస్కరిస్తూ, వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం కనుక మీరే పోటీ చేయాలని గట్టిగా చెప్పారు.

ఈ సమావేశంలో జరిగిన ఈ చర్చలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి గురువారం అమరావతిలో టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గం పులివెందులలో గెలుస్తారో లేదో తెలియని సిఎం జగన్మోహన్ రెడ్డి పిట్టలదొర కధలు చెప్పారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా..

• వైసీపీలో 127 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ఐప్యాక్ నివేదిక ఇస్తే, జగన్ దానిలో ఒకటి తొలగించి 27 మంది పనితీరు బాగోలేదని జగన్ అబద్దం చెప్పుకొన్నారు.

• ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెపుతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి మీ పనితీరు ఎలా ఉందో ఎప్పుడైనా తెలుసుకొన్నారా? ఎమ్మెల్యేలను గడప గడపకి వెళ్లాలని చెపుతున్న మీరు ఎప్పుడైనా గడప గడపకి తిరిగారా?ప్రజలు మీ
గురించి, మీ ప్రభుత్వం గురించి ఏమనుకొంటున్నారో తెలుసుకొన్నారా?

• మీరు ఏ జిల్లాలో అడుగుపెడితే అక్కడ బ్యారీకేడ్లు, పరదాలు మాటున తిరిగి వెళ్ళిపోతుంటారు మరి ప్రజల కష్టాలు మీకెలా తెలుస్తాయి?

• వచ్చే ఎన్నికలలో మీ మంత్రులే పోటీ చేయడానికి భయపడుతున్నారంటే మీ పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. వారు పోటీ చేయమని తెగేసి చెపుతుంటే, మీరు వాళ్ళని బ్రతిమాలుకోవలసివస్తోంది. అయినా వచ్చే
ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుస్తామని పిట్టల దొరల చెప్పుకొంటున్నారు.

• ఓ పక్క రాష్ట్రంలో ఇసుక మాఫీయా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మీరు లెక్కలు చూసుకొంటూ వచ్చిన ఆ సొమ్మును ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తరలిస్తున్నారు. కనుక
మీరు అమరావతికి నాన్ లోకల్, హైదరాబాద్‌కి లోకల్.

• మీరు ఎప్పుడూ విమానాలలోనే తిరుగుతుంటారు కనుకనే మీకు రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లు కనబడటం లేదు. వాటినే పూడ్చలేక, పూడ్చినవాటికి బిల్లులు చెల్లించలేకపోతున్న మీరు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు? మీకు
అంత పట్టుదల ఉంటే మొన్న శాసనసభ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు?అంటూ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి సిఎం జగన్మోహన్ రెడ్డిని కడిగేశారు. ఈ వీడియో చూస్తే ఆయన నిశిత విమర్శలతో
అందరూ తప్పక ఏకీభవిస్తారు.