Srinivasa Kalyanam releasing on 9th Augustఆగష్టు 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న “శ్రీనివాస కళ్యాణం” సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించింది. తాజాగా నాలుగు నిముషాల నిడివి గల మేకింగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసారు నిర్మాత దిల్ రాజు. ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్’గా తెరకెక్కిన ఈ సినిమా మేకింగ్ షాట్స్ లో ముఖ్యంగా పెళ్లి సీన్ల చిత్రీకరణను చూపించారు.

నితిన్ ను పెళ్లికొడుకు చేయడం దగ్గరుండి, ఇద్దరూ ఒకరి తలపై మరొకరు తలంబ్రాలు పోసుకునేటంత వరకు చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే… ఈ నాలుగు నిముషాలలో మినీ మ్యారేజ్ ను చేసి చూపించారు చిత్ర యూనిట్. దాదాపుగా 60 మంది భారీ తారాగణంతో షూటింగ్ జరపడంతో సెట్ అంతా కళకళలాడుతూ దర్శనమిచ్చింది.