srinivas-reddy-poker-player-talking-with-tnrసినీ సెలబ్రిటీల లగ్జరీల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకరు డ్రగ్స్… మరొకరు మద్యం… ఇంకొకరు ఇంకోటి..! ఇలా చాలా సందర్భాలలో చాలా పేర్లు విన్నాం. అయితే తాజాగా కమెడియన్ శ్రీనివాస రెడ్డి మాత్రం తానూ ఒకప్పుడు పేకాటకు బానిసని ఒప్పుకున్నారు. సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ఖాళీగా ఉంటే తనకు పేకాట తప్ప మరొక ఆలోచన వచ్చేది కాదని, అయితే రానూ రానూ తానూ అవలంభిస్తున్న విధానం తప్పని భావించి, దానిని క్రమక్రమంగా తగ్గించుకున్నానని, ప్రస్తుతం పూర్తిగా మానేసానని తెలిపారు.

అయితే నేను సగర్వంగా చెప్పగలను… పేకాట బాగా ఆడతానని, శీను గాడి ముక్క కింద పడితే చాలు అని అనుకునే రేంజ్ లో ఆడేవాడిని అన్న శ్రీనివాస్ రెడ్డి, తానూ ఈ ఆటలో పెద్దగా ఏమీ డబ్బులు పోగొట్టుకోలేదు అన్నారు. కొంత పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ, పెద్ద మొత్తంలో కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అంత బాగా ఆడటం వచ్చిన శ్రీను, ఏ విధంగా డబ్బులు పోగొట్టుకున్నారు? అంటే… ‘పేకాట’ అంటే అదే… ముందు తెస్తుంది… తర్వాత వదిలించేస్తుంది… అని వివరణ ఇచ్చుకున్నాడు.

పేకాట నుండి దూరం కావడానికి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, తనలో వచ్చిన ఆలోచనా మార్పే దీనికి కారణమని, సినిమాలలో కనిపించే తనతో నేను పేకాట ఆడాను, నేను ఆడాను… అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… తనపై బ్యాడ్ పబ్లిసిటీ అవుతుందని తలచి, నిదానంగా దూరమయ్యానని, ముందుగా ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ తగ్గించుకున్నానని, అయితే ప్రస్తుతం అది కూడా పూర్తిగా మానేసానని అన్నారు. సినీ సెలబ్రిటీలలో చాలా మంది చాలా రకాల అలవాట్లు ఉన్నప్పటికీ ఎవరూ తొందరగా గుట్టు విప్పరు. కానీ, శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాస్త ఓపెన్ గానే చెప్తుండడం విశేషం.