srinivas-reddy-interview-show-Jayammu-Nischayammu-Raa-to-NTRతమ మధ్య ఏర్పడిన దూరం కేవలం తాత్కాలికమే, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి, మునుపటిలా మళ్ళీ మేం కలిసి ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన కమెడియన్ శ్రీనివాస రెడ్డి, తను నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా స్పెషల్ షో వేసి ఖచ్చితంగా చూపిస్తానని, అంతకు ముందు తానూ నటించిన “గీతాంజలి” సినిమా చూసి కూడా మెచ్చుకున్నారని, అయితే తన వరకు ‘గీతాంజలి’ అనే సినిమా ఒక రొటీన్ ఫార్ములాలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఒక తారక్ ని గానీ, రవితేజను గానీ, బన్నీని గానీ లేదా దిల్ రాజును గారినో… ఇలాంటి వారందరినీ పిలిచి గొప్పగా చూపించుకునే సినిమా “జయమ్ము నిశ్చయమ్మురా” అని చెప్పిన శ్రీనివాస రెడ్డి, ‘గీతాంజలి’ క్రెడిట్ మొత్తం కోన వెంకట్ దేనని, తానూ హ్యాండిల్ చేస్తే సినిమా ఇలా ఉంటుందని నిరూపించుకున్నాడని, అలాగే తన వరకు ఒక ఆర్టిస్ట్ గా నిరూపించుకుంటే అది ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మాదిరి ఉంటుందని అన్నాడు.

నిజానికి ‘గీతాంజలి’ సినిమా విడుదలైనపుడు పోస్టర్లలో తన ఫోటో ఒక్కటి కూడా లేదని తన స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన వారు ఫోన్ చేసి అడిగితే, అవును నిజమే అని నమ్మి… తానూ కూడా వెంటనే కోన వెంకట్ కు ఫోన్ చేసి అడగగా, ‘ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు’ అని చెప్పారని, సినిమా విడుదలైన తర్వాత ఫస్ట్ పోస్టర్ నాది, అంజలిది కలిపి వచ్చిందని, అప్పుడు తనకు అర్ధమైందని, కోన వెంకట్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయని నాటి విషయాలను నెమరువేసుకున్నారు.