srimanthhudu dosaసినీ హీరోలపై ప్రేక్షకులకున్న మక్కువను తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ బిజినెస్ ను పెంచుకోవడంలో భాగంగా తాము తయారు చేసే వంటకాలకు సినిమాలు, సినీ నటుల పేర్లు పెడుతూ వినూత్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల భీమవరంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మెనూను పరిచయం చేస్తూ ఓ హోటల్ వినియోగదారులకు వల వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాదులోని ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1 లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘కారప్పొడి’ రెస్టారెంట్లో ‘శ్రీమంతుడు’ దోశెలు సందడి చేస్తున్నాయి. ఈ దోశె ధర కేవలం 678 రూపాయలు అని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్పారు. ఇందులో బంగారం పూతను ఐదు లేయర్లుగా దోశెపై పూసినట్టు వారు వెల్లడించారు. సంప్రదాయానికి భిన్నంగా వినూత్నంగా ఇలాంటి వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తూ వ్యాపారం పెంచుకుంటున్నారు.