srikanth reddy comments about on chandrababu naiduవైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు అప్పుడప్పుడు ప్రత్యేక హోదా గుర్తు వస్తుంది. గుర్తుకు వచ్చిన వెంటనే అధికారంలో ఉన్నది తామే అన్న విషయం మర్చిపోయి టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తారు. తాజాగా ప్ర‌భుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అదే పని చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వెన‌క‌డుగు వేస్తోంది. చంద్ర‌బాబు మోడిని విమ‌ర్శించడానికి భ‌య‌ప‌డుతున్నరు అంటూ చెప్పుకొచ్చారు.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం 2014 నుండీ వెన‌క‌డుగు వెనకడుగు వేస్తూనే వచ్చింది. అయితే కేంద్రం మెడలు వంచి తెస్తామనే కదా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది? ఇక చంద్ర‌బాబు మోడిని విమ‌ర్శించడానికి భ‌య‌ప‌డుతున్నరు అనేది నిజమే కావొచ్చు అయితే దానికీ ప్రత్యేక హోదా సాధనకు లింక్ ఏమిటి?

23 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న చంద్రబాబు మోడీని విమర్శించినా, విమర్శించకపోయినా జరిగేది ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఇవ్వాల్సింది కేంద్రం తేవాల్సింది రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్. ఆ విషయానికి వస్తే 2019 నుండి కేంద్రాన్ని భయపడకుండా విమర్శించిందా వైఎస్సార్ కాంగ్రెస్?

ఇప్పటికే ప్రజలు అవకాశమిచ్చిన ఐదేళ్లలో రెండేళ్లు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా విషయం తాము మర్చిపోయినట్టే ప్రజలకు కూడా గుర్తు రాకుండా చేస్తే అధికార పక్షానికి మేలు. గుర్తు చేసి రాకపోవడానికి చంద్రబాబే కారణం అంటే మాత్రం ప్రజలను కన్విన్స్ చెయ్యడం కష్టమే మరి. ఆ దిశగా ఆలోచన చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కే మంచిది.