బాలయ్య సినిమాకు బోయపాటి రాజీ

Srikanth as villain in Balakrishna - Boyapati-Srinu movieసింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో మూడవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొందరలో మొదలు కాబోతుంది.

2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలి అనుకున్నాడు బోయపాటి అయితే ఆయన అడిగిన రెమ్యూనరేషన్ కు బోయపాటి తో పాటు నిర్మాతలకు కూడా కళ్ళు బైర్లు కమ్మాయట. దీనితో ఆ విషయంలో బోయపాటి రాజీ పడ్డాడట.

ఇప్పుడు ఆ పాత్ర కోసం శ్రీకాంత్ ను అనుకున్నారట. శ్రీకాంత్ నాగచైతన్య ప్లాప్ సినిమా ‘యుద్ధం శరణం’ లో విలన్ గా కనిపించారు. అయితే అది పెద్దగా క్లిక్ కాలేదనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో ఇది రిస్క్ ఏమో. గతంలో బోయపాటి బాలయ్య లెజెండ్ సినిమాతో జగపతి బాబుని విలన్ గా నిలబెట్టి లైఫ్ ని ఇచ్చాడు. చూడాలి శ్రీకాంత్ కు ఏం జరుగుతుందో!

ఈ మధ్య బోయపాటి టైం కూడా ఏమీ బాలేదు. వరుసపరాజయాలతో ఆయన సతమతం అవుతున్నారు. దీనితో ఈ సినిమా కోసం మరింత కసిగా పని చెయ్యబోతున్నారు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టిస్తుందిFollow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

akhanda Dallas Kammas TicketsDon't MissAkhanda U.S. Record: Crying On Kammas Goes To Next LevelNandamuri Balakrishna's Akhanda has taken a flying start at the box office despite the mixed...Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...

Mirchi9