There-Are-Videos-&-CDs-on-Pawan-Kalyan---Sri-Reddyదాదాపుగా నెల రోజులుగా జరుగుతోన్న ‘కాస్టింగ్ కౌచ్’ అంశంపై శ్రీరెడ్డి చేస్తోన్న పోరాటానికి తెలుగు మీడియా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఓ పక్కన రాజకీయ వేడి, మరో పక్కన రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కన పెట్టి కూడా శ్రీరెడ్డి అంశాన్ని హైలైట్ చేస్తూ కధనాలు ప్రసారం చేసాయి, చర్చలు జరిపించాయి. కానీ ఒక్కసారిగా శ్రీరెడ్డికి తెలుగు మీడియా ముఖం చాటేసింది. ఇందుకు కారణం లేకపోలేదు.

అప్పటివరకు సాగిన పోరాటంలోకి పవన్ కళ్యాణ్ పేరు తీసుకువచ్చి, అకారణ ఆరోపణలు చేయడం, అది కూడా అసభ్యకరమైన భాషలో శ్రీరెడ్డి స్పందించడం అనేది ఎవరికీ రుచించలేదు. పవన్ కేవలం సూచనలు మాత్రమే చెప్పారు, అవి ఇష్టం లేకపోతే ‘మీ సూచనలు మాకు అవసరం లేదు అంటే సరిపోతుంది,’ కానీ అలా కాకుండా శ్రీరెడ్డి చేసిన యాక్షన్ పవన్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ జుగుప్సాకరంగా మారింది. దీంతో ఒక్కసారిగా శ్రీరెడ్డిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

చేసేదేమీ లేక ఈ సారి ఏకంగా నేషనల్ మీడియాకు ఎక్కి బోరుబోరున విలపించింది. “సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తనను అభ్యతరకంగా వేధిస్తున్నారని, నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టారని, అయినప్పటికీ తన చివరి రక్తపు బొట్టు వరకు తాను ‘కాస్టింగ్ కౌచ్’పై పోరాడుతూనే ఉంటానని, తనకు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని” బోరుబోరున విలపించింది. ‘ముందుగా నోరు జారడం ఎందుకు, ఇప్పుడు ఇలా కన్నీరుమున్నీరు కావడం ఎందుకు’ అన్న ప్రశ్నలు రావడం సహజమే!