Sri Reddy Leaks actresses photos in usa sex racketఅమెరికాలో బట్టబయలు అయిన సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్న వారి భాగోతం బయట పెడతానంటూ హెచ్చరికలు చేసిన శ్రీరెడ్డి, ఆ తర్వాత విడతల వారీగా కొన్ని ఫోటోలను బయట పెడుతోంది. అయితే ఈ ఫోటోలలో ఉన్న వారంతా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారని ప్రస్తావించకుండా, పరోక్షంగా హింట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం త్రిష, రకుల్ ప్రీత్ సింగ్ వంటి టాప్ హీరోయిన్ల ఫోటోను పెడుతూ… అనేక ప్రశ్నలను వదిలిన శ్రీరెడ్డి, ఫేస్ బుక్ వేదికగా 36 మంది సెలబ్రిటీల లిస్టును చెప్తూ… వీరంతా బాగా నటించగలరు అంటూ పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విమలా రామన్, పృధ్వీ, సురేఖావాణి, జగపతిబాబు, సోనియా అగర్వాల్ ల ఫోటోలు రిలీజ్ చేస్తూ… శ్రీ రాజ్ గురించి న్యూస్ తెలిసిందా? అంటూ ప్రశ్నించింది.