Sri Reddy leaks actresses names to CNN channelటాలీవుడ్ ను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశాలలో యుఎస్ సెక్స్ రాకెట్ ఒకటి. ఈ జాబితా చాలా పెద్దదే ఉందంటూ వస్తోన్న వార్తలు ఒక వైపు కాగా, ఈ లిస్టు తన దగ్గర ఉందంటూ శ్రీరెడ్డి తాజాగా ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది. సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తోందో లేక నిజంగానే ఉన్నాయో గానీ, ‘శ్రీరెడ్డి లీక్స్’ పేరుతో చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

‘ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వ్యబిచారం కేసు లో ఉన్న తెలుగు యాంకర్స్, పెద్ద హీరోయిన్స్, చిన్న హీరోయిన్స్ అందరి లిస్టు నా దగ్గర ఉంది. ఆ లిస్టు ని CNN, IBN చానల్స్ కి ఇచ్చేసాను, మీ బాగోతాలు అన్ని బయట పెడుతున్నా జాగ్రత్త’ అంటూ తొలుత చేసిన ట్వీట్ తర్వాత, ఓ హీరోయిన్ పేరు హింట్ ఇస్తూ మరో ట్వీట్ ను పోస్ట్ చేసింది.

“టాలీవుడ్ వ్యబిచారం కేసుల లిస్టు లో ఉన్న ఒక అమ్మాయి గురించి చెప్తా. తను సాయిధరం తేజ్ తో ఎక్కువగా వర్క్ చేసిన హీరోయిన్” అంటూ హింట్ ఇవ్వడంతో సదరు హీరోయిన్ ఎవరో అన్న విషయం దాదాపుగా తెలిసిపోయింది. ఈ లీక్స్ లో మరిన్ని బయటకు వస్తాయో ఏమో గానీ, వర్మ ఉదంతం తర్వాత సైలెంట్ అయిన శ్రీరెడ్డి, సోషల్ మీడియా వేదికగా మళ్ళీ చెలరేగిపోతోంది.