Sri Reddy into politicsశ్రీరెడ్డి… ఈ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. గత కొంత కాలంలో తెలుగు, తమిళ సెలెబ్రిటీల మీద లైంగిక ఆరోపణలు చేసి వార్తలలోకి ఎక్కింది. అయితే ఇప్పటివరకూ ఒక్క ఆరోపణకు కూడా రుజువు చెయ్యలేదు. ఈ మధ్య కాలంలో తమిళ నటుడు స్టాలిన్ మీద కూడా ఆమె ఇటువంటి ఆరోపణలే చేసిందని వార్తలు వచ్చాయి.

తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టిన శ్రీరెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రెస్ మీట్‌లో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఉదయనిధిపై ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా చేసిన ఆరోపణల్లో నిజం లేదని తాను ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్టులో నిజం కాదని పేర్కొంది. ఆయన గురించి వచ్చిన పోస్టు.. నా అధికార ఫేస్‌బుక్‌ ఖాతాది కాదు. అది ఓ నకిలీ ఖాతా అని. కావాలనే ఎవరో పనిగట్టుకుని ఆ పోస్ట్ చేశారంది.

ఇది ఇలా ఉండగా తాను తొందరలో తమిళ రాజకీయాలలోకి వస్తున్నా అని, తన రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడం కోసమే ఇలాంటి పుకార్లకు తెరలేపు తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే… ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ తనకు ఎంపీ టిక్కెటు ఆఫర్ చేసిందని ఆమె చెప్పుకొచ్చింది

“నేను పోటీ చేస్తే గెలవడం ఖాయం. మహిళలంతా నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది. అయితే చెన్నై లో స్థిరపడాలని నిర్ణయించుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పోటీ చెయ్యలేదు,” అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఇంతకూ శ్రీరెడ్డి టిక్కెట్టు ఆఫర్ చేసిన పార్టీ ఏంటో?