Sri Reddy going in wrong direction-గత నెల రోజులుగా వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి ఉదంతం, ఇటీవల పతాక స్థాయికి చేరుకుంది. ఫిల్మ్ చాంబర్ ఎదుట టాప్ లెస్ గా కూర్చుని నిరసన తెలియజేయడంతో, ఆగ్రహించిన ‘మా’ శ్రీరెడ్డిపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా మీడియాలకెక్కి ‘మా’ సభ్యులపై విమర్శలు చేసింది.

నిజానికి తాము శ్రీరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నామని, బహుశా దర్శకుడు తేజ సినిమాల తర్వాత మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవేమోనని, కానీ తప్పుడు మార్గంలో పయనించి అతిపెద్ద పొరపాటు చేసిందని, ఆమె ఎంచుకున్న మార్గం సరైంది కాదు కాబట్టే అవకాశాలు రాలేదని, ఇండస్ట్రీలో ప్రతిభకు తోడు అదృష్టం కూడా కలిస్తోస్తేనే రాణించగలరని సినీ నటుడు ఉత్తేజ్ అభిప్రాయపడ్డారు.

అలాగే ఈ ఉదంతం గమనించిన దర్శకుడు తేజ కూడా పరోక్షంగా స్పందించారు. “యాక్టింగ్, డైరెక్షన్ వంటి అంశాలపై అవగాహన లేకుండా మాత్రం సినిమా రంగంలో కాలు పెట్టవద్దని, తెలిసీ తెలియకుండా సినిమా ఫీల్డ్ లోకి వస్తే, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వుంటుందని, కొత్త రక్తం ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నవీన ఆలోచనలతో కూడిన సినిమాలు వస్తాయని అన్నారు.