Sri-Reddy-Hopes-Top-Heroines-Open-Dirty-List“బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా… నిజమైన హీరో పరిటాల రవి గారు. ఆయనే ఉండుంటే గడ్డంకి, జుట్టుకి పెయింటింగ్ లు వేస్కునేవాళ్ళు, సిఎం అవ్వకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాలలో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చేగువేరా అవుతారా… మేల్కొండి గొర్రెల్లారా… అసలే వర్షాకాలంరా నాయనా, వానల్లోకి వెళ్లోద్దని చెప్పండి, రంగు పోయి పులి వేషం వేసుకున్న నక్కకి…” అంటూ పేర్లు చెప్పకుండా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

ఇంతకీ ఈ పోస్ట్ లో శ్రీరెడ్డి ఎవరిని టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా చేస్తోన్న హంగామాకు కొనసాగింపుగానే ఈ పోస్ట్ చేసింది. అయితే ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టే విషయం ఏమిటంటే… ఇక్కడ పరిటాల రవిని ప్రస్తావించడమే. ఫ్లాష్ బ్యాక్ లో హల్చల్ చేసిన పుకార్లను ఎత్తిచూపుతూ శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ కు అభిమానుల నుండి వచ్చే స్పందనను ఊహించవచ్చు. అలాగే పలువురికి రిప్లైలు ఇస్తూ కౌంటర్లు కూడా వేసింది.