Sri Reddy casting Couch allegations on Raghava Lawrence and actor Sriramడ్యాన్సర్ గా కెరీర్ ఆరంభించి కొరియోగ్రాఫర్ గా ఎదిగి, హీరోగా, సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా… ఇలా అనేక రకాల పాత్రలు పోషించిన లారెన్స్ రాఘవపై శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్ట్ చేసింది. తన స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలిసిందంటూ…. మసబ్ ట్యాంక్, గోల్కొండ హోటల్ లాబీలో జరిగిన ఘటనను ఉదహరించింది.

తన రూమ్ లోకి తీసుకెళ్ళిన లారెన్స్, ఆ తర్వాత తాను కష్టపడిన విధానం చెప్పారని, అలాగే తాను చేస్తోన్న ప్రజా సేవ గురించి చెప్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యానని, తన రూమ్ లో ఉన్న గురు రాఘవేంద్రస్వామి ఫోటోలు, రుద్రాక్షలు చూసి మంచి అనుభూతి కలిగిందని, కానీ ఆ తర్వాత తన నిజ స్వరూపాన్ని లారెన్స్ చూపించారని తెలిపింది.

ముందుగా తన నడుమును చూపించమన్నారని, అలాగే అద్దం ముందు నిలబడి టెంప్ట్ చేసుకోమన్నారని, రొమాంటిక్ మూవ్స్ చేయమన్నారని, అవన్నీ చేసిన తర్వాత ఒక రైడ్ కు వెళ్లివచ్చామని, వెంటనే మీ ఆఫర్ ఖరారయ్యిందని చెప్పగా, ఆ తర్వాత కూడా తన స్నేహం కొన్నాళ్ళ పాటు కొనసాగించానని, కానీ ఇందులో బెల్లంకొండ విలన్ గా మారారని తెలిపింది.

తన స్నేహితురాలు చెప్పిన విషయంగా ఇదంతా ‘తమిళ్ లీక్స్’ అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అంతకుముందు హీరో శ్రీరామ్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. అయిదేళ్ళ క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీలో భాగంగా హైదరాబాద్ లో కలిసినపుడు… అంటూ రాయలేని విషయాన్ని చెప్పిన శ్రీరెడ్డి, డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక రోల్ ఆఫర్ చేసిన విషయం గుర్తుందా? అంటూ పోస్ట్ చేసింది.