Sri Reddy another leak after nude protestశనివారం నాడు ఫిల్మ్ చాంబర్ ముందు అర్థ నగ్నంగా నిరసన తెలిపిన శ్రీరెడ్డిని తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆదేశించారు. ఈ విషయాన్ని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో చెప్పుకుని వాపోయింది. ఇంటి యజమాని ఓ ఐఏఎస్ ఆఫీసరని, ఉన్నత స్థాయిలో ఉన్నా, అల్ప బుద్ధిని చూపించారని, తానుంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేయాలని చెప్పారని, ఎంత గొప్ప ప్రజలో అంటూ ఓ పోస్టును పెట్టింది.

అంతకు ముందు “అక్కా నువ్వు మంచి డాన్ అంట. ఎవరినైనా గోడౌన్స్ లో వేసి కుమ్మిస్తావంట. అంకుల్స్ అందరికీ చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తావంట. నా జోలికి రాకు అక్కోయ్” అని మరో పోస్టు పెట్టింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలన్న విషయాన్ని మాత్రం శ్రీరెడ్డి వెల్లడించక పోవడం గమనార్హం. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలను కేవలం పడక సుఖం కోసమే వాడుకుంటున్నారే తప్ప అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి.

ఈ నిరసన తరువాత తనకు ఇంకా అవకాశాలు రావని, తనకు నటించాలన్న ఆసక్తి కూడా లేదని చెప్పింది. తెలుగు అమ్మాయిల కోసమే తాను గళమెత్తుతున్నానని, ఇప్పటివరకూ తాను టాలీవుడ్ కు చేతనైనంత సేవ చేశానని చెప్పింది. “నన్ను నగ్నంగా నిలబెట్టిన టాలీవుడ్ కు ఇది బ్లాక్ డే. ఇది తెలుగు కళామతల్లికే సిగ్గు చేటు. నా యుద్ధం కొనసాగుతుంది” అని పోస్టు పెట్టింది. తమిళనాడులో జల్లికట్టు తరహాలో తెలుగు హీరోయిన్లకు మద్దతుగా నిరసనలు తెలియజేయాలని కోరింది.

ఇదిలా ఉంటే తాజాగా ‘వివా హర్ష’ పేరును తెరపైకి తెచ్చింది. హర్షతో జరిగిన వాట్స్ యాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టింది. తాను షార్ట్ ఫిల్మ్ లో అవకాశం కోరుతూ అతన్ని సంప్రదించానని చెబుతూ, చిన్న చిన్న నటులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది. ఈ సంభాషణల్లో శ్రీరెడ్డిని హర్ష తన హోటల్ గదికి రమ్మని పిలుస్తూ ఉండటం, ఆమెకు ఓ అడల్డ్ సైట్ లోని వీడియోలు పంపడం, “నిన్ను చూసి ఆగలేకున్నాను” అని అంటుండటం కనిపిస్తోంది.

ఇక, బట్టలిప్పుకుని తిరిగితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం రాదని, కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే శ్రీరెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ, అర్థనగ్నంగా తిరిగిందని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా వ్యాఖ్యానించాడు. ‘మా’ అసోసియేషన్‌లో ఉన్న 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించబోరని, ఒకవేళ ఎవరైనా ఆమెతో నటిస్తే అసోసియేషన్‌ నుంచి వారిని తొలగిస్తామని హెచ్చరించారు. మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌ లో సభ్యత్వం కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని, అవి ఎవరికైనా ఒకటేనని అన్నారు.

అనవసరంగా ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని తెరపైకి లాగుతోందని ఆరోపించారు. హీరోయిన్లు చిన్నవారైనా, పెద్దవారైనా ఏ సమస్య వచ్చినా తాము పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ తేజ ఆమెకు రెండు అవకాశాలు ఇచ్చారని, ఆనందంగా వాటిని చేసుకోక, టీవీ చానల్స్ కు ఎక్కి విమర్శలు గుప్పిస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని, ఇప్పుడు ఆ రెండు అవకాశాలు కూడా ఆమెకు దూరమైనట్టేనని, ఇక మున్ముందు ఎలాంటి సినీ అవకాశాలు ఉండబోవని శివాజీరాజా స్పష్టం చేసారు.