Sri Reddy Allegations on dil Rajuటాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజును టార్గెట్ చేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమ నుండి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కుల రాజకీయాలు చేస్తున్నాడని, ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని చెప్పింది.

“కుళ్లు రాజకీయాలు వద్దన్నా… ఆడ పిల్లలన్నా… బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామ్మతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి” అని వ్యాఖ్యానించింది.

తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టులో చెప్పింది. కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పలువురి పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా ట్వీట్లపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని కామెంట్లు వస్తున్నాయి.