sri-reddy-directly-reveals-another-big-name-live‘కాస్టింగ్ కౌచ్’పై పోరాటం చేస్తోన్న శ్రీరెడ్డి మరోసారి దగ్గుపాటి అభిరామ్ పై చెలరేగారు. ఇప్పటికే అభికి సంబంధించిన ఫోటోలను లీక్ చేసిన శ్రీరెడ్డి, తాజాగా రామానాయుడు స్టూడియోలో అరాచకాలు జరుగుతున్నాయని విరుచుకుపడింది. “వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిన రామానాయుడు స్టూడియోస్ కి తక్షణం వాళ్ళ నుండి విముక్తి కలిగించాలని, అభిరామ్ లాంటి వ్యక్తుల్ని నిర్భయ చట్టం క్రింద అరెస్ట్ చేయాలని” డిమాండ్ చేసింది శ్రీరెడ్డి.

“జీవితంలో ఏ అమ్మాయి ఫీలింగ్స్ తో ఆడుకున్నా, అభి లాంటి వ్యక్తులకు పట్టే గతి పడుతుందని భయపడాలని, మాతో ఆడిన ఎవడ్ని వదిలేది లేదు… నా ఉద్యమానికి మరకలు అంటించేవాళ్ళకి ఇదే నా సవాల్…” ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ‘మా’ బహిష్కరణ విరమింపుతో అంతా సర్దుమనిగిందని భావిస్తున్న వారికి ఈ పోస్ట్ ఓ మేలుకొలుపు లాంటిదని చెప్పవచ్చు. తన ఉద్యమం ఇంతటితో ఆగలేదని శ్రీరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేస్తోంది