Sharwanand Sreekaram - Sree Vishnu Gaali Sampath- Naveen Polishetty Jathiratnaluకరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలు కుదేలు అయిపోయాయి. దాదాపుగా పది నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా ఇంట్లో పెట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి. ఓటీటీలు ఈ టైం లో స్పీడ్ గా వస్తుండడంతో ఇక థియేటర్ల పని అయిపోయింది అనుకున్నారు అంతా.

అయితే ఒక్క సంక్రాంతి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిస్థితిని అంతా మార్చేసింది. ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. దీనితో టాలీవుడ్ లో దాదాపుగా సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. వారానికి ఒక సినిమా అన్నట్టుగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఒక్కో వారమైతే ఏకంగా రెండు మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి.

మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రకటింపబడ్డాయి. శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు గాలి సంపత్, నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు ఆ రోజున విడుదల అవుతున్నట్టు ప్రకటించేశాయి. మూడు సినిమాలు థియేటర్ల కోసం కొట్టుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒక్క టాలీవుడ్ లోనే ఈ పరిస్థితి ఉంది.

పక్క రాష్ట్రాలలో ఏదో ఒక చెప్పుకోదగ్గ సినిమా వస్తే థియేటర్ల ఫీడింగ్ ఉంటుందని ఆశగా చూసుకునే పరిస్థితి. పక్కనే ఉన్న తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి కి మాస్టర్ వంటి పెద్ద సినిమా విడుదలైనా మిగతా సినిమాలకు ధైర్యం చాలడం లేదు. ఒకరకంగా ప్రపంచంలోనే ఏదైనా ఇండస్ట్రీ పరిస్థితి బావుంది అనుకుంటే అది టాలీవుడ్ అనే చెప్పుకోవాలి.