Sree Vishnu respnds on Veera Bhoga Vasantha Rayalu Posterఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచిన “వీరభోగవసంతరాయలు” మూవీకి సంబంధించి దర్శకుడు ఓ వివాదాస్పదమైన పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రివ్యూలను టార్గెట్ చేస్తూ… అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉన్న సదరు పోస్టర్ పై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.

సినిమాలో విషయం లేకుండా విశ్లేషకులను టార్గెట్ చేయడం కేవలం పబ్లిసిటీ కోసమేనని మండిపడుతున్న తరుణంలో… ఈ పోస్టర్ పై హీరో శ్రీవిష్ణు స్పందించారు. “ఈ వ్యంగ్యర్ధాల పోస్టర్ తో, తనకు ఎలాంటి సంబంధం లేదని, చిత్ర సమీక్షకులను తానెప్పుడూ గౌరవిస్తానని, వారికి నా మద్దతు ఉంటుందని” స్పష్టం చేసారు.