Sree Vishnu Bhala Thandananaతన మొదటి సినిమా బాణం తోనే మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు చైతన్య దంతులూరి. అయితే రెండో సినిమా ప్లాప్ కావడంతో ఇబ్బంది పడ్డాడు ఈ యువ దర్శకుడు. అయితే బ్రేక్ తీసుకుని మంచి స్క్రిప్ట్ తో యువ హీరో శ్రీవిష్ణు ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చాడు ఇప్పుడు. ఆ సినిమానే భళా తందనాన. అచ్చ తెలుగు టైటిల్ తో పేరుతోనే మంచి మార్కులు కొట్టేశాడు చైతన్య.

ఈసారి స్క్రిప్ట్ పక్కా గా సిద్ధం చేసుకున్నా అని హిట్ ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట చైతన్య. కాథరిన్ థెరిసా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ విలన్ రామచంద్ర రాజు విలన్ గా కనిపించబోతున్నారు. తన వారాహి చలన చిత్రం బ్యానర్ పై సీనియర్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఈరోజు ముహూర్తం జరుపుకుంది.

వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. యువ హీరోలలో అత్యంత బిజీ గా ఉన్న హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. లాక్ డౌన్ తరువాత ఇండస్ట్రీ తెరుకుకోగానే వరుసగా సినిమాలు ప్రకటిస్తూ పోతున్నాడు. అంత స్పీడ్ లో కూడా క్వాలిటీ కి పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. శ్రీవిష్ణు శివరాత్రికి గాలి సంపత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే రాజరాజ చోర అనే సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ వారంలోనే మొన్నామధ్య ఆహా వీడియో కోసం జోహార్ అనే సినిమా తీసిన తేజ మార్ని తో అర్జున ఫాల్గుణ అనే సినిమా కూడా మొదలుపెట్టాడు. ఆ రకంగా ఎంటర్టైన్మెంట్, అలాగే కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో ముందుకు పోతున్నాడు శ్రీ విష్ణు. ఈ స్పీడ్ లొనే రెండు మూడు హిట్లు కొడితే హాట్ షాట్ యాక్టర్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే విభిన్నమైన కథాంశాలతో తీసే డైరెక్టర్లతో చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయితే భిన్న వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.