Sree-Vishnu-Alluriశ్రీ విష్ణు మంచి నటుడు.తనలోని కొత్త కోణాల్ని ప్రతి సినిమాలో ప్రదర్శించాలనుకునే నటుడు. కానీ అతని సినిమాలు చూస్తే, శ్రీవిష్ణు కొన్ని సినిమాలకే పనికొస్తాడు అనిపిస్తుంది . ప్రేమ ఇష్క్ కాదల్, ఉన్నది ఒకటే జిందగీ, రాజ రాజ చోర లాంటి సున్నితమైన పాత్రలకు సరిగ్గా సరిపోతాడు శ్రీవిష్ణు. మాస్ హీరో అయిపోవాలని ఆశపడి, శ్రీవిష్ణు చేసిన ప్రతి సినిమా ప్లాపు గా మిగిలింది.

శ్రీవిష్ణు చేసిన అప్పట్లో ఒకడుండేవాడు, వీరభోగవసంతరాయులు, అర్జున ఫాల్గుణ లాంటి సినిమాలు, మాస్ ఇమేజ్ తీసుకురాకపోగా ఉన్న కాస్త ఇమేజ్ ని పాడు చేసాయి. రీసెంట్ గా విడుదలయిన ‘అల్లూరి’ సినిమా కూడా.. శ్రీవిష్ణుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది.

మాస్ సినిమాలు తనకు కలిసిరావని తెలుసుకుని, శ్రీవిష్ణు తన పాత పంధాలో, బాగా కలిసొచ్చిన రొమాంటిక్ కామెడీనే నమ్ముకుని, ఈరోజు కొత్త సినిమాని ప్రారంభించాడు.

అయితే ఒక విషయం మాత్రం ఖచ్చింతం గా చెప్పచ్చు. ఇంత పోటీ లో కూడా తనకంటూ ఒక మార్కు వేసుకోవడం మామూలు విషయం కాదు. ఇది సినిమా పట్ల తనకున్న ప్రేమ, కొత్తగా ఎదో చేయాలనే తపనని శ్రీ విష్ణు లో మనం ప్రతి మూవీకీ చూడచ్చు.

ఏకె ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రం శ్రీవిష్ణు కి మంచి విజయాన్ని అందిస్తుందని, శ్రీవిష్ణు ట్విట్టర్ మాధ్యమంలో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.శ్రీవిష్ణు ప్రియ స్నేహితుడు నారా రోహిత్ ,చాలా రోజుల తరువాత బయటకొచ్చి , ఈ సినిమా పూజా కార్యక్రమంలో క్లాప్ కొట్టి, శ్రీవిష్ణుకి శుభాకాంక్షలు తెలియజేసారు.