Sree Mukhi High paid contestant in Bigg Boss Telugu Season 3బిగ్ బాస్ మూడవ సీజన్ పూర్తి అయిపోయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి రన్నర్ అప్ గా నిలిచారు. అయితే బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా శ్రీముఖికి బాధ లేదట. కారణం బిగ్ బాస్ పేరు చెప్పి అందరికంటే ఎక్కువ సంపాదించింది ఆమె అని సమాచారం. షో కోసం ఆమెకు కోటి రూపాయిలు ముట్టచెప్పారట.

షోలో పార్టిసిపేట్ చెయ్యడానికి శ్రీముఖికి రోజుకు లక్ష, చివరి వరకు ఉంటే కోటి రూపాయిలు ఇస్తామని ఒప్పుకున్నారట. దాని ప్రకారం ఆమెకు కోటి వచ్చాయట. విజేత రాహుల్ కు ప్రైజ్ మనీ కింద 50 లక్షలు రాగా అతని రెమ్యూనరేషన్ చాలా తక్కువట. రెండు కలిపినా శ్రీముఖి దరిదాపులలోకి కూడా రాదట. అసలు ఇప్పటివరకూ మూడు సీజన్లలో అందరికంటే ఎక్కువ వచ్చింది శ్రీముఖికే అని అంటున్నారు.

శ్రీముఖి పాటు భార్యతో కలిసి జంటగా వచ్చిన వరుణ్ సందేశ్-వితికాలకు గట్టిగానే ముట్టినట్టు తెలుస్తోంది. కపుల్ ప్యాకేజ్ కింద ఈ ఇద్దరికీ దాదాపుగా 75 లక్షలు ముట్టినట్టు సమాచారం. ఇదే సమయంలో హోస్ట్ నాగార్జునకు రెమ్యూనరేషన్ ఎంతంటే.. రూ. 5 కోట్ల పైమాటేనట. ఇది ఇలా ఉండగా తరువాతి సీజన్ హోస్ట్ ఎవరు అనేదాని పై ఇప్పటి నుండే చర్చ మొదలయ్యింది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే గ్రాండ్ ఫినాలే కాస్తా మెగాస్టార్ వన్ మ్యాన్ షోగా అయిపోయింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ తో అందరిని అలరించారు. అప్పటి నుండి బిగ్ బాస్ తరువాతి సీజన్ హోస్టుగా చిరంజీవే ఉండబోతున్నారని వార్తలు వస్తున్నాయి