Spyder VS Jai Lava Kusaసూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సిన టీజర్ ఒక రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, అశేష సినీ అభిమానుల ప్రశంసలు పొందడంలో మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” టీజర్ సక్సెస్ సాధించింది. కేవలం 24 గంటల్లో యూ ట్యూబ్ రికార్డులను షేక్ చేసిన “స్పైడర్” పట్ల ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో, ఈ క్లిక్స్ చెప్పకనే చెప్పాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టాలీవుడ్ సినిమాల టీజర్లలో ప్రస్తుతం ‘స్పైడర్’దే అగ్ర స్థానం.

“స్పైడర్” తర్వాత విడుదల అవుతోన్న తొలి పెద్ద సినిమా టీజర్ గా బాబీ – జూనియర్ ఎన్టీఆర్ “జైలవకుశ” నిలవనుంది. జూలై మొదటి వారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నామని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ’ ట్విట్టర్ ఖాతా ద్వారా నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ‘స్పైడర్’ ఖాతాలో ఉన్న యూ ట్యూబ్ క్లిక్స్ రికార్డులను “జైలవకుశ” బద్దలు కొడుతుందో లేదో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలతో పాటు, ఆయా హీరోల అభిమానుల్లోనూ నెలకొని ఉంది.

ఒకవేళ అదే జరిగితే “జైలవకుశ” పట్ల ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఏంటో కూడా బయటపడినట్లవుతుంది. కధల పరంగా ఈ రెండు చిత్రాలు పూర్తి విభిన్నం కనుక, ‘జైలవకుశ’ చిత్ర యూనిట్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో సందేహం లేదు. జూలై 5వ తేదీన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావచ్చు అన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి గానీ, మరికాసేపటికే అందులో వాస్తవం లేదన్న విషయం ఖరారయ్యింది. ఎప్పుడు విడుదల చేసిన రికార్డుల దుమ్ము దులుపుతాము అంటున్నారు ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్..! అవునా… కాదా..!