Spyder Theatrical Trailer Leakedమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “స్పైడర్” సినిమాకు తెలుగునాట క్రేజ్ దక్కడంలో ప్రత్యేకత ఏమీ లేదు. తెలుగు సినీ ప్రేక్షకులలో మరియు అభిమానుల మదిలో మహేష్ కున్న క్రేజ్ రీత్యా… ఇది ఊహించిన విషయమే అయినా… తమిళనాట కూడా “స్పైడర్”కు క్రేజ్ లభించడం మాత్రం ఊహించని పరిణామంగా పేర్కొనవచ్చు. మురుగదాస్ సినిమాలకు క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే గానీ, “స్పైడర్”కు మాత్రం అంతకు మించిన స్థాయిలో స్పందనలు రావడం పట్ల ట్రేడ్ వర్గాలలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ తొలి 24 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం విశేషం. తెలుగులో ఎన్ని మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకున్నా, అందులో మురుగదాస్ – మహేష్ క్రేజ్ మినహా మరేమీ కనిపించదు గానీ, తమిళంలో ఈ రేంజ్ లో క్లిక్స్ రావడం మాత్రం “స్పైడర్” క్రేజ్ ను చాటి చెప్తోంది. అక్కడ స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా, ఆ తర్వాత స్థాయిలో “స్పైడర్” ఊపుతుందన్న సంకేతాలను అయితే వ్యక్తపరుస్తోంది.