Spyder Teaser Clicksప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “స్పైడర్” రెండవ టీజర్, వీక్షకుల ఆదరణను చూరగొనడంలో విఫలమైందన్న విషయం స్పష్టమైంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ టీజర్, యాక్షన్ సన్నివేశాలతో గందరగోళంగా ఉండడంతో, ఏకపక్షంగా డివైడ్ టాక్ వచ్చింది. అయితే ప్రిన్స్ మహేష్ బాబుకున్న రేంజ్ రీత్యా… యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని భావించిన ప్రిన్స్ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది.

‘గ్లిమ్స్’ పేరుతో విడుదలైన తొలి టీజర్, మొదటి 24 గంటల్లో ఒక్క యూ ట్యూబ్ లోనే దాదాపుగా 5 మిలియన్ క్లిక్స్ ను దాటిపోయింది. ఫేస్ బుక్ ను కూడా కలిపితే 6.30 మిలియన్ క్లిక్స్ ను అందుకుని, సౌత్ ఇండియా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత దీనిని ‘జై లవకుశ’ టీజర్ అధిగమించిందిలేండి అది వేరే విషయం! అయితే ఆ రికార్డులను ‘స్పైడర్’ తాజా టీజర్ రూపుమాపుతుందని వేసిన అంచనాలు తలక్రిందులయ్యాయి.

12 గంటలు గడిచే సమయానికి కేవలం 2.5 మిలియన్ క్లిక్స్ ను మాత్రమే అందుకోవడంతో, కనీసం ‘స్పైడర్’ తొలి టీజర్ రికార్డును కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ టీజర్ ప్రేక్షకులలో ఎలాంటి సంకేతాలను పంపించిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుందని ట్రేడ్ వర్గాలలో నెలకొన్న భారీ అంచనాలను కూడా ఈ టీజర్ పూర్తిగా తగ్గించినట్లయ్యింది.