Spyder movie team clarifies on leakage rumoursఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు పట్టిన ఏకైక భయం ‘లీకేజ్.’ విడుదలకు ముందే ఆన్ లైన్ లో సినిమాలు దర్శనమివ్వడం ఒక వంతయితే, క్రేజీ ప్రాజెక్ట్ లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు లీక్ కావడం మరో ఎత్తు. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన రెండు పార్టులకు ఈ లీకేజ్ తప్పలేదు. అలాగే ‘రోబో 2.0’ సినిమా విషయంలోనూ కొన్ని స్టిల్స్ ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ‘స్పైడర్’ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

షూటింగ్ జరుగుతున్నంత కాలం కేవలం అక్కడక్కడ షూటింగ్ పిక్స్ మినహా పెద్దగా ఏమీ లీకేజ్ బారిన పడిన సందర్భాలు లేవు. అయితే షూటింగ్ ముగిసిన, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సమయంలో… ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో నిజానిజాలను తెలిపేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ఓ అధికారిక ప్రకటన చేసింది. ‘స్పైడర్’ ఫుటేజ్ లీక్ అయ్యిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, వాటిని నమ్మవద్దని, అవన్నీ ఫేక్ వీడియోస్ అని స్పష్టత ఇచ్చింది.

ఒక్కసారిగా ఇండస్ట్రీలో కలకలం రేపిన ఈ సంఘటనలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ప్రిన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు గానీ, సినిమా ప్రమోషన్ కు జరుగుతున్న కార్యక్రమాల పట్ల తీవ్ర నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండవ పాట విడుదల టైం, ట్రైలర్ రిలీజ్ డేట్, ఆడియోల విడుదల గురించి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా ప్రిన్స్ అభిమానులు కౌంటర్లు ఇచ్చే పనిలో ఉన్నారు. మరి ఇప్పటికైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి.