“స్పైడర్” రిలీజ్ డేట్ పై ప్రకటన!

Mahesh Babu Spyder Latest Tollywood News‘ఫస్ట్ లుక్’ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతగా వేచిచూసారో, ప్రస్తుతం “స్పైడర్” సినిమా విడుదల తేదీ ప్రకటన గురించి కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన మార్పుల రీత్యా జూన్ 23వ తేదీ నుండి మహేష్ సినిమా తప్పుకుందన్న వార్తలు బలపడ్డాయి. దీంతో సరికొత్త విడుదల తేదీ ఏమై ఉంటుంది? జూన్ లో కుదరకపోతే జూలైలో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే ఆగష్టులోనే విడుదల ఉంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ప్రిన్స్ అభిమానులను వేధిస్తున్నాయి.

అసలు వాయిదాకు గల కారణం ఏంటి? నిజంగా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ పిఆర్ఓ బిఎరాజు తాజాగా సమాధానం ఇచ్చారు. మే 2వ తేదీ నుండి “స్పైడర్” సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించబోతున్నారని, మే నెలాఖరు నాటికి చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి కానుందని చెప్పిన రాజు గారు, రిలీజ్ డేట్ పై కూడా జవాబిచ్చారు. ‘స్పైడర్’ విడుదల తేదీ మార్పును స్పష్టం చేస్తూ… త్వరలోనే విడుదల తేదీని నిర్ణయిస్తారని చెప్పడంతో, జూన్ 23 అన్నది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నది ఖరారైంది.

మొత్తానికి బిఎ రాజు ద్వారా “స్పైడర్” సమాచారాన్ని ఇచ్చారు గానీ, రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. ఇటీవల హల్చల్ చేసిన టాక్ ప్రకారం అయితే ఆగష్టు 11 లేక 25 తేదీలలో విడుదల ఉండవచ్చు అని వినపడింది. కానీ, ఇంతకంటే ముందే రిలీజ్ డేట్ ప్రకటన ఉంటుందన్న ఆశాభావాన్ని ప్రిన్స్ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. బహుశా ‘శ్రీమంతుడు’ విడుదలైన తేదీనే ‘స్పైడర్’ను తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతోంది.

Follow @mirchi9 for more User Comments
A-Vaccine-Used-in-India-since-1948-May-Help-Protect--from-COVID-19Don't MissA Vaccine Used in India since 1948 May Help Protect from COVID-19A preliminary study posted on medRxiv, a site for unpublished medical research claims that Countries...Can India Afford to Relax the Lockdown?Don't MissCan India Afford to Relax the Lockdown?We are on the Eleventh Day of the Three Weeks Nationwide Lockdown. The country did...Don't MissOne Coronavirus Vaccine Showing Good Results - Details Here:A potential vaccine for Coronavirus has been developed and tested successfully in mice and there...YS - Jagan - Ramoji RaoDon't MissRamoji Rao's Donations Brings Questions on JaganMedia Baron and Eenadu Group Chairman, Ramoji Rao had announced a donation of 10 Crore...Corona Virus Deaths in US Cross That of 9/11 TollDon't MissCorona Virus Deaths in US Cross That of 9/11 TollThe United States has become the Epicenter of Coronavirus infections across the globe. The country...
Mirchi9