spyder-mahesh-babu-namrata-vacationతన సినిమాలు ఫ్లాప్ అయితే ఎంతగా అబ్ సెట్ అవుతానో అనే విషయం ప్రిన్స్ మహేష్ బాబు వివిధ సందర్భాలలో బహిరంగంగానే వెల్లడించారు. మరి భారీ అంచనాలు పెట్టుకున్న ‘స్పైడర్’ సినిమా ఫలితం వచ్చిన తర్వాత మహేష్ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా మరోసారి తీవ్ర నిరాశపడి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే… ఈ సినిమా సక్సెస్ పై ప్రిన్స్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరచగా, అంతిమంగా అవన్నీ అడియాశలు అయ్యాయి.

ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి తాను ఏదైతే చేస్తారో, ప్రస్తుతం కూడా అదే చేసారు ప్రిన్స్. తన భార్య నమ్రత మరియు ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారలతో కలిసి ఇటలీ వెళ్ళిపోయారు. నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో ఈ విషయం స్పష్టమైంది. ప్రస్తుతం కుటుంబంతో కాలం గడుపుతూ, మనోనిబ్బరాన్ని మళ్ళీ నింపుకుని అక్టోబర్ 15వ తేదీన కొరటాల శివ “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నారు.