Spyder Latest Working Stills Mahesh Babuగత రెండు రోజులుగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రిన్స్ 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో గత స్మృతులన్నీ గుర్తు చేసుకున్న అభిమానులు, ఆ తర్వాత ‘స్పైడర్’ సర్ ప్రైజ్ వీడియోతో అవాక్కయ్యారు. దీంతో బుధవారం నాడు సాయంత్రం విడుదల కాబోతున్న మొదటి పాట కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్న సమయంలో… ఆ పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది.

ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా విడుదలైన ఈ స్టిల్స్… ప్రిన్స్ అభిమానులను ఓ విధంగా పిచ్చెక్కిస్తున్నాయని చెప్పవచ్చు. 18 ఏళ్ళ కెరీర్ లోనే ఎన్నడూ లేనంత స్టైలిష్ గా… ఈ ‘బూమ్ బూమ్’ పాటకు సంబంధించిన స్టిల్స్ లో ప్రిన్స్ దర్శనమిస్తున్నారని మురిసిపోతున్న అభిమానులు కోకొల్లలు. ఆ మాటకొస్తే ఒక్క ప్రిన్స్ అభిమానులే కాదు, అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనపడుతున్న మహేష్ ను చూసి సగటు సినీ అభిమానులు కూడా ‘ఫిదా’ అవుతున్నారు.

దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ స్టిల్స్ బుధవారం నాడు విడుదల అవుతోన్న పాట పైనే కాదు, ఏకంగా సినిమాపై కూడా భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. మరో పక్కన శబ్దాలయ స్టూడియోలో డబ్బింగ్ చెప్తోన్న మహేష్, మధ్యలో మురుగదాస్ కు ఫోన్ చేసి సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా వస్తున్న ‘స్పెషల్’ న్యూస్ లతో ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోందని చెప్పవచ్చు. చూడబోతుంటే… రానున్న రోజులన్నీ “స్పైడర్”వే అనిపించే సంకేతాలు కనపడుతున్నాయి.