SPYder Latest News - Shooting Sets‘అన్నం ఎలా ఉడికిందో’ తెలుసుకోవడానికి రెండు మెతుకులు చాలంటారు. ఇటీవల విడుదలైన ‘స్పైడర్’ టీజర్ కూడా ఇదే రకమైన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ 10 మిలియన్స్ దాటిపోయిన ‘స్పైడర్’ క్లిక్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ‘కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్’కు నిలయంగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే హీరో భరత్ వంటి వారు ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

ముఖ్యంగా తాను పాల్గొన్న వియత్నాం షెడ్యూల్ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను తనకు – మహేష్ కు మధ్య చిత్రీకరించారని, అవి చాలా అద్భుతంగా వచ్చాయని చిత్ర విశేషాలను ప్రముఖ ఆంగ్ల మీడియా పత్రికతో పంచుకుని ప్రిన్స్ ఫ్యాన్స్ ను మరింత హుషారెత్తించారు. అయితే తాజాగా “స్పైడర్”కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘స్పైడర్’ సినిమాలో ఈ రోలర్ కాస్టర్ ఎపిసోడ్ యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా చిత్రీకరించారని, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అద్భుతంగా ఉండబోతోందని, ‘స్పైడర్’ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మరిన్ని సినిమాల చిత్రీకరణ జరగడం ఖాయమంటూ… ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ ప్రిన్స్ అభిమానులు సందడి చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ లో ‘స్పైడర్’ ట్రెండ్ సెట్టర్ గా నిలవడం ఖాయమన్న సంకేతాలైతే స్పష్టంగా కనపడుతున్నాయి మరి!