After Non-BB Records Who’s Working With Harish Shankarప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న సినిమాగా మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” సినిమా మారింది. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ‘మెగా’ కాంపౌండ్ దర్శకుడు హరీష్ శంకర్ కామెంట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఎక్కువగా మెగా హీరోల సినిమాలనే పొగిడే హరీష్ శంకర్, అందుకు విరుద్ధంగా మహేష్ సినిమా పోస్టర్ పై కామెంట్ చేయడం అనేది ఆసక్తికరమైన పరిణామమే.

ఇప్పటివరకు మహేష్ ఇచ్చిన స్టిల్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టిల్స్… ఏం యాటిట్యూడ్… విడుదల కోసం వేచి చూడలేను… అంటూ మెట్లపై కూర్చున్న పోస్టర్ ను పోస్ట్ చేసాడు హరీష్ శంకర్. ఇటీవల ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా ద్వారా నెటిజన్లకు బలైన హరీష్ శంకర్, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. తన తదుపరి సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్న హరీష్, ప్రిన్స్ మూవీపై కామెంట్ చేయడం ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని విషయమే.