SPyder Audio Launch - Mahesh Babu Speechప్రిన్స్ మహేష్ బాబు… ఈ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి… ఈ పేరు వింటే అభిమానులు పులకించిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహేష్ బాబు సినీ వేడుక పైకి ఎక్కారంటే… ‘ఏం మాట్లాడాలో’ అంటూ పదాలు వెతుక్కోవడం ఎప్పుడూ జరిగే విషయం. కానీ “స్పైడర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం అందుకు విరుద్ధం. స్టేజ్ పైకి ఎక్కింది మొదలు… మాట్లాడిన ఏడెనిమిది నిముషాలు తన స్పీచ్ తో అదరగొట్టేసాడు. ఒక విధంగా చెప్పాలంటే… సినీ వేడుకలపై ఇప్పటివరకు మహేష్ చేసిన ‘ది బెస్ట్ స్పీచ్’గా ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసంగం అభిమానులకు ఎప్పుడు గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.

“పోకిరి” సినిమా సమయంలో మురుగదాస్ గారిని కలుసుకున్నానని మొదలుపెట్టిన ప్రిన్స్, ఆయనతో సినిమా చేయడానికి పదేళ్ళ సమయం పట్టిందని, తనకు గంటన్నర్ర పాటు చెప్పిన ‘స్పైడర్’ కధ చెప్పారని, అద్భుతమైన థ్రిల్లర్ చేద్దాం… అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంటుంది… అద్భుతమైన ఫైట్లు ఉంటాయి… అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి… రెండు గంటల ఇరవై అయిదు నిముషాల పాటు సినిమా ఉంటుంది… చూసిన ఆడియన్స్ “స్టన్” అయిపోవాలి… అంటూ చెప్తూ… ‘ఆడియన్స్ ఏంటి సార్, డబ్బింగ్ చెప్తుంటే… నేనే స్టన్ అయ్యా…’ అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో “స్పైడర్” పట్ల ఉన్న నెగటివ్ భావాలను తొలగించివేసింది.

ఇక ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించిన సంతోష్ శివన్ గురించి మాట్లాడుతూ… “ఆయన ఇండియాలోనే గొప్ప టేక్నిషియన్, సాధారణంగా అసలు ఎవరి ఫంక్షన్స్ కు రానే రారు, అలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటే… ‘జై బాబు జై బాబు అంటారేంటి…’ అంటూ అభిమానులను అన్న తీరుకు… నిజంగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ కు ఎలా ఉందో గానీ, టీవీల ముందు వీక్షిస్తున్న అభిమానులు ఆనందాన్ని ఆపుకోలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కాస్త వినండి… అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు ప్రిన్స్.

ఇక ప్రిన్స్ సెన్సాఫ్ హ్యుమర్ కు నిదర్శనంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎపిసోడ్ నిలుస్తుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత అందరి గురించి చెప్పిన ప్రిన్స్, హీరోయిన్ రకుల్ గురించి మరిచిపోయి మళ్ళీ వచ్చి, ‘డైరెక్టర్ మురుగదాస్ మాదిరే నేను కూడా రకుల్ గురించి మరిచిపోయాను’ అని చెప్పగానే ఆడిటోరియంలో అందరూ ఫక్కున నవ్వేసారు. ఇక రొటీన్ గానే హీరోయిన్ గురించి మరో రెండు ముక్కలు చెప్పారు. అంతకుముందు దర్శకుడు మురుగదాస్ కూడా అందరి గురించి చెప్పి హీరోయిన్ రకుల్ గురించి మరిచిపోయి, మళ్ళీ వచ్చి చెప్పగా, దానిని ఫుల్ ఫన్ గా మార్చేసారు ప్రిన్స్.

ఇక ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ప్రిన్స్ ఇచ్చిన స్పీచ్ అత్యంత ఆసక్తిని రేపింది. “మీ లాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరోకు ఉండరు” అని మహేష్ చెప్పిన వెంటనే ఆడిటోరియం అంతా గోల గోల చేయగా… దానిని ఎలా సమర్దించుకుని చెప్తారో అని అంతా ఎదురుచూసిన తరుణంలో… అదిరిపోయే స్థాయిలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు ప్రిన్స్. ‘ఎందుకంటే… చెప్తా వినండి… మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే మీరే చూడరు…” అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలకు ఫిదా కాని ఫ్యాన్ ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫ్యాన్స్ విషయంలో ఏదైతే మహేష్ చెప్పారో… ఆ మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే… అవి మహేష్ ఫ్యాన్స్ కే ఎరుక..!

ఇలాంటి ఫ్యాన్స్ ఏ హీరోకు ఉండరని మహేష్ చెప్పారో… అభిమానుల మనసులను అంత లోతుగా అర్ధం చేసుకునే ఇలాంటి హీరో కూడా మన టాలీవుడ్ లో లేరని ప్రిన్స్ అభిమానులు కూడా అంతే గట్టిగా చెప్తున్నారు.