coronavirus cases in andhra pradeshఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది. గడచిన 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో 210 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 49 ఇతర రాష్ట్రాల ప్రజలు మరియు విదేశీ తిరిగి వచ్చినవారు. మిగిలిన 161 కేసులు స్థానిక కేసులు. వ్యాప్తి జరిగినప్పటి నుండి ఒక్కరోజు లో ఇది అతిపెద్ద స్పైక్. గత 24 గంటల్లో ఇరవై తొమ్మిది మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 73 మంది మరణించారు మరియు 2,323 మంది డిశ్చార్జ్ అయ్యారు, 1,192 క్రియాశీల కేసులు ఉన్నాయి. జిల్లా వారీగా వివరాలను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. కాబట్టి, ఏ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే దానిపై స్పష్టత లేదు.

తెలంగాణలో కూడా కేసుల ఉదృతి ఎక్కువగా ఉంది. పైగా అక్కడి ప్రభుత్వం సరిగ్గా టెస్టులు చెయ్యడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఈ ఉదయం బులెటిన్) ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,36,657. దేశంలో ఒక్క రోజులో దాదాపుగా 10,000 కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుండి అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసులలో మూడొంతుల కేసులు ఈ రాష్ట్రాల నుండి నమోదు అవుతున్నవే.