speedunnodu trailer talk‘అల్లుడు శీను’ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, తాజాగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో “స్పీడున్నోడు” చిత్రంతో రెండవ సారి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఎటువంటి ఆసక్తి కలుగజేయకపోవడంతో తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

“ఆవారా తిరిగే కొడుకు – బాధ్యత గల తండ్రి” ఇలాంటి ‘దిల్’ తరహా సినిమాలు ప్రేక్షకులు ఎన్ని చూసారో లెక్కే లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇదే తరహా కధతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైందని చెప్పవచ్చు.

“స్పీడున్నోడు”తో తన ‘స్పీడ్’ చూపిద్దామని భావిస్తున్న శ్రీనివాస్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తాడో చూడాలి. ‘అల్లుడు శీను’లో ఐటెం సాంగ్ చేసిన ‘మిల్కీ బ్యూటీ’ తమన్నానే మరోసారి హైలైట్ కాబోతుందన్నట్లుగా, ట్రైలర్ ఆదిలోనే తమన్నా ‘బ్యాచిలర్ బాబు’ పాటతో దర్శనమిస్తుంది. మిల్కీ ‘పరువాలు’ మాత్రం ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంతకంటే ఈ ట్రైలర్ లో ఏమైనా ఉందా? మీరే చూడండి..!