speculations Chiranjeevi joining janasena partyమెగాస్టార్ చిరంజీవిని ‘జనసేన’లోకి తీసుకువస్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ను క్లియర్ చేస్తున్నారనేది, ఇటీవల పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం. అందుకే “ప్రజారాజ్యం” ప్రస్తావనను, తన అన్న చిత్తశుద్ధిని పవన్ చెప్పుకొస్తున్నారు అనేది ఈ వార్తలకు బలం చేకూర్చిన అంశం. చిరు తరపున పవన్ ఇంత చేస్తుంటే… మరి పవన్ కోసం చిరంజీవి ఏం చేయబోతున్నారు..?

ప్రస్తుతం ఈ ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే… గతంలో ‘ప్రజారాజ్యం’ స్థాపించిన సమయంలో చిరంజీవిలో ఉన్న ‘స్వార్ధమే’ ప్రజలకు కనిపించింది తప్ప, ‘సేవ’ ఏ మాత్రం కనిపించలేదన్నది స్పష్టం. మరి చిరుపై ఉన్న అంత నెగటివ్ భావనను పవన్, పాజిటివ్ గా మార్చే ప్రక్రియ చేస్తుంటే… పవన్ విషయంలో అయినా మెగాస్టార్ ‘స్వార్ధ’ వైఖరి మారేనా? అంటే…

సినీ, పొలిటికల్ టాక్ ప్రకారం… అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారనేది లేటెస్ట్ గా హల్చల్ అవుతున్న విషయం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చిరు, ‘జనసేన’ జెండా పట్టుకుంటారని, తమ్ముడి కోసం మరోసారి రాజకీయ రంగంలోకి దిగుతారని, కాలం కలిసి వస్తే… ‘ప్రజారాజ్యం’ ద్వారా నెరవేరలేని “కల” జనసేన ద్వారా తీర్చుకుంటారనేది అసలు విషయంగా మారింది.

ప్రస్తుతం ఉన్న ఎంపీ పదవి కాలం కూడా ముగిసిపోయింది గనుక కాంగ్రెస్ కు ‘రాంరాం’ చెప్పేయడం పెద్ద విషయం కాదు. అలాగే చిరు ఉండడం వలన కాంగ్రెస్ కు కూడా పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే ‘జనసేన’ జెండా పట్టుకుంటే అయినా… చిరు ప్రజలు నమ్ముతారా..? అంటే అది ప్రశ్నార్ధకమే. ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు కూడా చెలగాటంలా మారనుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది కాలమే సమాధానం చెప్పాలి.