SP Bala Subramanyam Coronavirus positiveకరోనా వైరస్ సెలెబ్రిటీలను సైతం వదిలిపెట్టడం లేదు. ఇండస్ట్రీ మూతపడి, సినిమా సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నా కరోనా బారిన పడటం గమనార్హం. తాజాగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కు కూడా కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని బాలు స్వయంగా వీడియో ద్వారా తెలిపారు.

రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ఆయన వివరించారు. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అందరి అశీస్సులతో తొందరలోనే కోలుకుంటానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వివరించారు. ఈ సమయంలో తాను రెస్టు తీసుకోవాలనే ఆసుపత్రిలో చేరానని, కావున ఎవరూ ఫోన్లు చెయ్యవద్దని ఆయన కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇతర భాషలలో సుమారు 40,000 సినిమా పాటలు పాడిన ఘనత ఎస్పీ బాలసుబ్రమణ్యం కు ఉంది. అతను భారతీయ చలన చిత్ర సంగీతం యొక్క ఆల్ టైమ్ లెజెండ్‌లలో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన తన కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డారు.