Launched one lakh Covid-19 rapid test kits that have arrived from South Korea,ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కొరియా నుండి దిగుమతి చేసుకున్న రాపిడ్ టెస్టు కిట్ల మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కిట్లు 730 రూపాయిలకు కొనుగోలు చేస్తే… ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేవలం 337 రూపాయలకు కొనడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.

కొనుగోలుకు మధ్యలో ఉన్న కంపెనీకి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజింద్రనాథ్ బంధువు ఒకరికి సంబంధం ఉందటంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనితో ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇది ఇలా ఉండగా…. రాజస్థాన్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాపిడ్ టెస్టు కిట్లు కొనుగోలు చేసింది.

అయితే ఇప్పుడు ఆ కిట్లను ఇప్పుడు పక్కన పడేసింది…. ఈ కిట్లు సరిగ్గా పని చెయ్యడం లేదని… వీటి ద్వారా వచ్చే ఫలితాలు కేవలం 5% లేక అంతకంటే తక్కువగా ఫలితాలు సరిగ్గా వస్తున్నాయని అక్కడి ప్రభుత్వ అధికారులు అంటున్నారు. దీనితో కథ కాస్తా ముందుకు వచ్చినట్టు అయ్యింది.

ఇది ఇలా ఉండగా… గడిచిన 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో మరో 35 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. రాష్ట్రంలోని మొత్తం కేసులలో 45% కేసులు కర్నూల్, గుంటూరు జిల్లాలలోనే నమోదు అయ్యాయి. కర్నూల్ లో కేసులు సంఖ్య 200కు చేరువలో ఉంది.